Nobel prize: అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌ల‌కు 2017 భౌతిక శాస్త్రం నోబెల్‌... ప్ర‌క‌టించిన నోబెల్ కమిటీ

  • రైన‌ర్ వీస్‌, కిప్ థోర్న్‌, బ్యారీ బారిష్‌ల‌కు నోబెల్‌
  • గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల‌పై ప‌రిశోధ‌న‌
  • లిగోలో ప‌రిశోధన‌లు చేస్తున్న ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు

గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల‌పై పరిశోధ‌న‌లు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్ర‌వేత్త‌ల‌కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ద‌క్కింది. అమెరికాకు చెందిన రైన‌ర్ వీస్‌, కిప్ థోర్న్‌, బ్యారీ బారిష్‌లు భౌతిక శాస్త్రంలో నోబెల్ గెల్చుకున్నట్లు స్టాక్‌హోంలోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్స్ ప్ర‌క‌టించింది. వీరికి 9 మిలియ‌న్ల స్వీడిష్ క్రోన్ల‌ను బ‌హూక‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ మొత్తంలో స‌గ‌భాగాన్ని రైన‌ర్ వీస్‌కు, మిగ‌తా స‌గాన్ని కిప్ థోర్న్‌, బ్యారీ బారిష్‌ల‌కు కేటాయించిన‌ట్లు పేర్కొంది. 2015 సెప్టెంబ‌ర్లో మొద‌టిసారి గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల మీద జ‌రిగిన ప‌రిశోధ‌న‌లో వీరు ముగ్గురు కీల‌క పాత్ర పోషించారు. లిగో (లేజ‌ర్ ఇన్‌ఫెరోమీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ వేవ్ అబ్జ‌ర్వేట‌రీ) ప్ర‌యోగం ద్వారా గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల మీద వీరు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.

More Telugu News