balakrishna: బాలకృష్ణకి విలన్ గా వివేక్ ఒబెరాయ్?

  • కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ
  • విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ తో సంప్రదింపులు
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. ఈ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలు భావించారు.

ఈ విషయంపై వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్లో ఇదే టాక్ వినిపిస్తోంది. గతంలో వివేక్ ఒబెరాయ్ తెలుగులో 'రక్త చరిత్ర' సినిమాలో నటించాడు. రీసెంట్ గా తమిళంలో వచ్చిన ' వివేగం' సినిమాలోను ఆయన మెప్పించాడు. ఇక బాలకృష్ణ మూవీలో వివేక్  ఒబెరాయ్ చేయడం నిజమే అయితే, అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.    

More Telugu News