నితిన్‌ గడ్కరీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం: విజయవాడలో నితిన్‌ గడ్కరీ

  • విజ‌య‌వాడ‌లో జాతీయ ర‌హ‌దారులు, జలరవాణా మార్గాల‌కు శంకుస్థాపనలు
  • దేశంలో 80 శాతం రవాణా జాతీయ రహదారులపై జరుగుతోందన్న గడ్కరీ
  • ఏపీలో జల రవాణా ప్రాజెక్ట్‌ పనులు త్వరగా పూర్తి చేస్తాం
  • 2019లోగా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యేందుకు నా వంతు సహకారం

దేశంలో 80 శాతం రవాణా జాతీయ రహదారులపై జరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో జాతీయ ర‌హ‌దారులు, జలరవాణా మార్గాల‌కు శంకుస్థాపనలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ... ఏపీలో జల రవాణా ప్రాజెక్ట్‌ పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. సాగునీరు ఇస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యేందుకు త‌న‌ వంతు సహకారం అందిస్తానని వ్యాఖ్యానించారు.

మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకి 28 కిలోమీటర్ల మేరకు కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు.  

More Telugu News