top order: టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన సునీల్ గ‌వాస్క‌ర్‌

  • శ్రీలంక, ఆస్ట్రేలియాల‌పై వ‌న్డేల్లో అద్భుత ప్ర‌తిభ‌
  • ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మం అని ప్ర‌శంస‌
  • ధావ‌న్ - రోహిత్‌, ర‌హానే - రోహిత్ జోడీలకు తిరుగులేదు

భార‌త జ‌ట్టు ప్ర‌స్తుత టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల‌ను టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ పొగడ్త‌ల‌తో ముంచెత్తారు. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో అత్యద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచి, జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించినందుకు వారిపై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. ప్రపంచంలో అత్యుత్తుమ టాప్ ఆర్డర్ భార‌త జ‌ట్టు సొంతం అని సునీల్‌ కొనియాడారు.

ముఖ్యంగా ధావన్‌- రోహిత్‌, రహానె- రోహిత్‌ ఓపెనింగ్‌ జోడీతో పాటు, వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీపైనా ఆయ‌న పొగ‌డ్త‌ల‌ జల్లు కురిపించారు. ఈ టాప్‌-3 బ్యాట్స్‌మెన్లను చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోందన్నారు. ఈ ముగ్గురూ చాలా సార్లు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశార‌ని, దీంతో వారి త‌ర్వాత నాలుగో స్థానంలో వచ్చే వారికి 30 నుంచి 40 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌ దక్కుతోంద‌ని గ‌వాస్క‌ర్‌ అన్నారు.

నాగ్‌పూర్‌లో జ‌రిగిన వన్డేలో కోహ్లీ 55 బంతుల్లో 39 పరుగులు చేయడం గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. నాగ్‌పూర్ లాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయ‌డం అంత సులభమేం కాద‌ని, అది ఇండోర్‌ లేదా బెంగళూరు పిచ్‌ల మాదిరిగా ఉండ‌క‌పోవ‌డంతో కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడ‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News