reliance: రూ. 96కే అన్‌లిమిటెడ్ డేటా.... ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌

  • అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జీ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన జియో
  • రూ. 149కి కూడా అప‌రిమిత డేటా
  • 2జీబీ డేటా వాడ‌కం త‌ర్వాత స్పీడ్‌లో త‌గ్గుద‌ల‌

ప్ర‌స్తుతం రూ. 309, అంత‌క‌న్నా ఎక్కువ రీఛార్జీ చేసుకున్న వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే రిల‌య‌న్స్ జియో అప‌రిమిత డేటా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. ప్రీపెయిడ్‌ వినియోగ‌దారుల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకోవ‌డం కోసం ఈ అప‌రిమిత డేటా ఆఫ‌ర్ సౌక‌ర్యాన్ని మ‌రో రెండు ప‌థ‌కాల‌కు కూడా జియో పొడిగించింది. ఇక నుంచి రూ. 96, రూ. 149తో రీఛార్జీ చేసుకున్న వారికి కూడా అన్‌లిమిటెడ్ డేటా సౌక‌ర్యాన్ని అందించ‌నున్న‌ట్లు జియో త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఈ రెండు రీఛార్జీ ప్లాన్ల‌లోనూ కొంత డేటా వినియోగించుకున్న త‌ర్వాత డేటా వేగం త‌గ్గుతుంది. రూ. 96తో రీఛార్జీ చేసుకుంటే 7 రోజుల పాటు అప‌రిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ 4జీ డేటా వాడుకోవ‌చ్చు. కానీ 1 జీబీ ప‌రిమితి త‌ర్వాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కి ప‌డిపోతుంది. అలాగే రూ. 149తో రీఛార్జీ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ వరకు 4జీ వేగంతో డేటా లభిస్తుంది. 2 జీబీ వినియోగం త‌ర్వాత‌ 64 కేబీపీఎస్‌ వేగంతో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.

More Telugu News