honey preet: మీడియాకు చిక్కిన హనీప్రీత్.. ఆమె ఇంటర్వ్యూ విశేషాలు ఇవే!

  • మా నాన్న (డేరా బాబా) అమాయకుడు
  • అల్లర్ల వెనుక నా హస్తం లేదు
  • తీర్పు సమయంలో షాక్ లో ఉన్నాం. కుట్రలెలా పన్నుతాం?
  • నన్ను దేశద్రోహి అనడం చాలా దారుణం

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే, మీడియా కంటికి మాత్రం ఆమె చిక్కింది. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు ఇవే..

  • మీడియాలో నాపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. అవన్నీ పచ్చి అబద్ధాలు. 
  • నన్ను దేశ ద్రోహిగా అభివర్ణించడం చాలా దారుణం. 
  • నా మానసిక పరిస్థితి దారుణంగా ఉంది. 
  • గుర్మీత్ కు శిక్ష పడ్డ తర్వాత జరిగిన అల్లర్ల వెనుక నా హస్తం ఉందని నిందలు వేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ల దగ్గర ఏమైనా ఆధారం ఉందా?
  • జరిగిందంతా మీడియా చూసింది. నేనేం నేరం చేశానో మీరే చెప్పండి. 
  • నేను ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు. అలాంటప్పుడు అల్లర్ల వెనుక నా హస్తం ఉందని ఎలా చెబుతారు?
  • సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తామనే మేము కోర్టుకు వెళ్లాం. అయితే, తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు దగ్గర తీవ్ర విధ్వంసం జరిగింది. 
  • తీర్పు నేపథ్యంలో మా మైండ్ పనిచేయడం కూడా మానేసింది. అలాంటి పరిస్థితుల్లో అల్లర్లకు మేమెలా కుట్రలు పన్నుతాం?
  • నా తండ్రి (డేరా బాబా) అమాయకుడు. ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్నారు.
  • ఒక కూతురు ఏం చేస్తుందో... నేను కూడా అదే చేశా.

More Telugu News