bengaluru model: మోడల్ పై అత్యాచారం చేసిన మాజీ ప్రియుడు

  • రియలెస్టేట్ కంపెనీలో పని చేస్తున్న నిందితుడు
  • మోడల్ తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది
  • గత కొంత కాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు
  • ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం

ఓ మోడల్ పై ఆమె మాజీ ప్రియుడు అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక చిక్కమగళూరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ రియలెస్టేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి నగరంలో ఉండే ఓ మోడల్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, అతని ప్రవర్తన నచ్చకపోవడంతో గత కొద్ది కాలంగా గౌతమ్ కు ఆమె దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో... గౌతమ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఆమె చంద్రా లేఔట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

More Telugu News