Rangana Herath: చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్ రంగన హెరాత్.. ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు!

  • 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర
  • కపిల్ రికార్డునూ అధిగమించిన వైనం

శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్-ఆర్మ్ సిన్నర్‌గా, శ్రీలంక రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అబుదాబిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హెరాత్ ఈ ఘనత సాధించాడు. పాక్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ అబ్బాస్ వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా తన ఖాతాలో ఓ ప్రపంచ రికార్డును హెరాత్ వేసుకున్నాడు.

అంతేకాదు ఈ మ్యాచ్‌లో హెరాత్ మరో రికార్డు కూడా సృష్టించాడు. పాకిస్థాన్‌పై వంద టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ తన పేరును లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌పై ఉండేది. పాకిస్థాన్‌పై కపిల్ 99 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు వంద వికెట్లు తీయడం ద్వారా కపిల్ రికార్డును హెరాత్ అధిగమించాడు.

More Telugu News