Kosciuszko Bridge: 1.8 కిలోమీటర్ల బ్రిడ్జిని రెప్పపాటులో కూల్చేశారు... వీడియో చూడండి!

  • 23 ఆగస్టు 1939న ప్రారంభమైన కిజ్కియాస్కో బ్రిడ్జ్ 
  • 38 మీటర్ల వెడల్పు, 1.8 కిలోమీటర్ల పొడవైన కిజ్కియాస్కో బ్రిడ్జి
  • బ్రూక్లిన్‌, క్వీన్స్‌ కౌంటీలను కలుపుతూ ఈస్ట్‌ నదికి ఉపనది అయిన న్యూటౌన్‌ క్రీక్‌ పై నిర్మితమైన కిజ్కియాస్కో బ్రిడ్జ్

అమెరికాలోని న్యూయార్క్ లో పురాతనమైన భారీ బ్రిడ్జ్ ని రెప్పపాటు కాలంలో అధికారులు కూల్చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్ లోని బ్రూక్లిన్‌, క్వీన్స్‌ కౌంటీలను కలిపే కిజ్కియాస్కో వంతెన పాతబడిపోయింది. 78 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్స్ పై పలు సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడి స్థానికులను తీవ్రఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని కూల్చేయడమే మేలని అధికారులు భావించారు.

ఈస్ట్‌ నదికి ఉపనది అయిన న్యూటౌన్‌ క్రీక్‌ పై 23 ఆగస్టు 1939న 38 మీటర్ల వెడల్పు, 1.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన కిజ్కియాస్కో బ్రిడ్జి ఇప్పుడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అప్పటి అంచనాల ప్రకారం ఈ బ్రిడ్జ్ ని పది వేల కార్ల ప్రయాణానికి అనువుగా నిర్మించగా, ఇప్పుడు వాటి సంఖ్య 1.8 లక్షలకు పెరిగింది. దీంతో ఇది ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు దీనిని కూల్చేశారు. 

More Telugu News