Tamil Nadu: మధురై మీనాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు.. దేశంలోనే పరిశుభ్రత గల ప్రదేశంగా గుర్తింపు!

  • తాజ్‌మహల్, తిరుపతి, స్వర్ణదేవాలయాన్ని వెనక్కి నెట్టిన వైనం
  • సోమవారం ఢిల్లీలో అవార్డు ప్రదానం

తమిళనాడు ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. మధురైలోని శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం దేశంలోనే పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రోగ్రాంలో భాగంగా ఆలయం ఈ గుర్తింపును దక్కించుకుంది.

దేశంలోని పది పరిశుభ్రత కలిగిన దిగ్గజ ప్రదేశాలను వడపోయగా మీనాక్షి ఆలయం బెస్ట్‌గా నిలిచింది. తాజ్‌మహల్, అజ్మీర్ షరీఫ్ దర్గా, స్వర్ణదేవాలయం, తిరుపతి, శ్రీ వైష్ణోదేవి ఆలయం తదితర ప్రదేశాలు మీనాక్షి టెంపుల్‌తో పోటీ పడలేకపోయాయి.

మధురై జిల్లా కలెక్టర్ కె.వీరరాఘవరావు, కార్పొరేషన్ కమిషనర్ ఎస్.అనీష్ శేఖర్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. మధురై ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నెలవారీ క్లీనింగ్ డ్రైవ్‌లో 300 మంది స్వచ్ఛందంగా పాల్గొని శుభ్రం చేస్తుంటారు.

More Telugu News