bbc telugu: ఇక తెలుగులోనూ బీబీసీ వార్తలు... శుభాకాంక్షలు చెప్పిన మంత్రి కేటీఆర్

  • తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో బీబీసీ వెబ్ సైట్ ప్రారంభం
  • ప్రస్తుతం ప్రతిరోజూ అరగంట బులెటిన్ ప్రసారం

అంత‌ర్జాతీయ మీడియా బీబీసీ ఇప్పుడు తెలుగులోనూ త‌మ సేవ‌ల‌ను ప్రారంభించింది. తెలుగు మాత్ర‌మే కాకుండా గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా త‌మ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు ఆ మీడియా పేర్కొంది. ఆయా భాష‌ల్లో వార్తా వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం తెలుగులో వెబ్‌సైట్‌తో పాటు ప్రతిరోజూ అరగంట బులెటిన్‌ను కూడా ప్రసారం చేస్తున్న‌ట్లు పేర్కొంది. త‌మను యూ ట్యూబ్‌తో పాటు సోష‌ల్ మీడియా సైట్ల‌లో అనుస‌రించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. బీబీసీ తెలుగులో వార్తా ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆ మీడియాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు చెప్పారు. తెలుగు వారికి మంచి సేవ‌ల‌ను అందించాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

More Telugu News