ఎస్‌బీఐ: ఎస్‌బీఐలో ఖాతా రద్దు చేసుకోవాలనుకునేవారికి శుభ‌వార్త‌!

  • మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధ‌నతో ఖాతాలను రద్దు చేసుకుంటోన్న ఖాతాదారులు
  • ఖాతా రద్దు చేయాలంటే ఇప్పటివరకు రూ.500లు చెల్లించుకోవాల్సిందే
  • ఇకపై రూ.500 చెల్లించే అవసరం లేదు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లో ఖాతా రద్దు చేయాలంటే ఇప్పటివరకు రూ.500లు చెల్లించుకోవాల్సివచ్చేది. అయితే, నిన్నటి నుంచి ఎస్‌బీఐ ఆ ఛార్జీల‌ను ర‌ద్దు చేసింది. ఏడాది పూర్తయిన సాధారణ పొదుపు ఖాతా, ప్రాథమిక పొదుపు ఖాతాదారులకు ఈ ప్ర‌క‌ట‌న వ‌ర్తిస్తుంద‌ని చెప్పింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌రువాత‌ ఖాతాదారుల మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధ‌నను ఎస్‌బీఐ రూ.5000 పెంచేసింది.

 ఇటీవ‌లే మెట్రో నగరాల్లో నిర్వహణ మొత్తాన్ని రూ.3 వేలకు కుదించింది. అయితే, అంత బ్యాలెన్సు నిర్వ‌హ‌ణ‌ను పాటించ‌లేని ఖాతాదారులు త‌మ ఖాతాల‌ను ర‌ద్దు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఛార్జీలను తొలగిస్తున్నామ‌ని ఎస్‌బీఐ అధికారులు చెప్పుకొచ్చారు. 

More Telugu News