prabhas: ప్రభాస్ బర్త్ డేకి 'సాహో' నుంచి టీజర్!

  • 'సాహో' షూటింగులో బిజీగా ప్రభాస్ 
  •  ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు
  •  ఆ సందర్బంగా టీజర్ రిలీజ్
  •   వేసవి సెలవుల్లో సినిమా రిలీజ్  

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. జ్యోతిష్యం .. ఆస్ట్రాలజీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. దర్శకుడు సుజీత్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విశేషాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23వ తేదీన. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి మేకింగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సమయంలోను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంలో ఏదో ఒక స్పెషల్ కంటెంట్ ను అభిమానులకు అందించారు. అదే తరహాలో ఈ సారి ఈ సినిమా నుంచి మేకింగ్ టీజర్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.   

More Telugu News