trump: మరోసారి ఉత్తర కొరియాను రెచ్చ‌గొట్టే ట్వీట్లు చేసిన డొనాల్డ్ ట్రంప్‌

  • సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృథా చేసుకోవడమే
  • గ‌తంలో క్లింటన్‌, బుష్‌, ఒబామాలు విఫలయ్యారు
  • 'నేను మాత్రం విఫలం కాను' అంటున్న ట్రంప్ 

ఓపక్క అమెరికాను బూడిద చేసేస్తానంటూ ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ విరుచుకుప‌డుతుంటే.. మరోపక్క అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనిని మరోసారి రెచ్చ‌గొట్టే ట్వీట్లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఉత్తర కొరియాతో చ‌ర్చ‌లు జరుపుతామని ఇటీవ‌ల అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్ అన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. లిటిల్‌ రాకెట్‌ మ్యాన్(కిమ్ జాంగ్ ఉన్‌) తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృథా చేసుకోవడమేన‌ని అన్నారు.

తాము ఇప్ప‌టి వరకు చేసిన మాదిరిగానే తమ ప‌ని తాము చేస్తామ‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడితో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని అన్నారు. మరి ఇప్పుడు ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్రశ్నించారు. గ‌తంలో క్లింటన్‌, బుష్‌, ఒబామాలు ఈ విష‌యంలో విఫలమయ్యారని, తాను మాత్రం అసలు విఫ‌లం కాబోన‌ని పేర్కొన్నారు.   

More Telugu News