yuvaraj singh: నెహ్రా పాస్, యువరాజ్ ఫెయిలా?... బీసీసీఐని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

  • యువరాజ్ ను టీ-20 సిరీస్ కు పక్కన బెట్టిన బీసీసీఐ
  • పలువురు స్టార్ ఆటగాళ్లనూ పట్టించుకోని ఎమ్మెస్కే
  • సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు, త్వరలోనే టీ-20 సిరీస్ ను ఆడనుండగా, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుపై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తూ, అందులో దినేశ్ కార్తీక్, ఆశిష్ నెహ్రాలను బీసీసీఐ చేర్చడాన్ని తప్పుబడుతున్నారు.

యువరాజ్, సురేశ్ రైనా, అశ్విన్, జడేజా, రహానే, మహ్మద్ షమీలకు ఈ జట్టులో స్థానం దక్కలేదు. ఇక పొట్టి ఫార్మాట్ లో యువరాజ్ సాధించిన రికార్డులను బీసీసీఐ మరచిపోయిందని, ఫిట్ నెస్ టెస్టులో దినేశ్, నెహ్రాలు ఎప్పుడు పాస్ అయ్యారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. యువరాజ్ ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. టీ-20లో ఎన్నో సూపర్బ్ ఇన్నింగ్స్ లను ఆడిన రైనాను పక్కన పెట్టడంపైనా బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News