garikapati: 'సినిమా రివ్యూల వివాదం'పై సినీ ప్రముఖలకు కౌంటర్ ఇచ్చిన గరికపాటి!

  • భోజనం చేసేవాడు బాగా లేదని చెప్పేందుకు హోటల్ పెట్టక్కర్లేదు
  • సినిమా బాగుందో లేదో చెప్పేందుకు అతను సినిమా తీయాల్సిన అవసరం లేదు
  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

ఈ మధ్య కాలంలో సినిమాలపై రివ్యూలు రాసేవారిపై సినీ ప్రముఖులు, కొందరు అభిమానులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా చేతనైతే విమర్శకులు మంచి సినిమా తీయాలని కూడా సవాలు చేస్తున్నారు. వారందరికీ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కౌంటర్ ఇచ్చారు. హరిద్వార్ వెళ్లి భోజనం చేసిన వ్యక్తికి అక్కడి భోజనం బాగుందో లేదో చెప్పే హక్కు ఉందని అన్నారు. అక్కడి భోజనం బాగా లేదని చెప్పడానికి అతను అక్కడ హోటల్ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాగే ఒక సినిమా చూసిన వ్యక్తికి ఆ సినిమా బాగుందో లేదో చెప్పే హక్కు కూడా ఉందని ఆయన అన్నారు.

 సినిమా బాగుందో లేదో చెప్పడానికి వారు సినిమా తీసి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అభిప్రాయం వ్యక్తీకరించే స్వేచ్ఛ అందరికీ ఉందని ఆయన తెలిపారు. అలాగే వారి మీద అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా ఉందని ఆయన అన్నారు. రెండింటినీ స్వీకరించి, మెరుగైన సమాజాన్ని రూపొందించేందుకు ఉపయోగించాలని ఆయన తెలిపారు. రాజకీయాలు ప్రక్షాళన కానంతవరకు సమాజం బాగుపడదని ఆయన అన్నారు. ఒక్క రాజకీయరంగం ప్రక్షాళన అయితే సమాజం మొత్తం దానంతట అదే బాగుపడుతుందని ఆయన తెలిపారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన చెప్పారు. 

More Telugu News