karnataka: ఐదేళ్ల సర్వీస్‌కు బయటకు వచ్చే పోలీసులకు ఫైన్.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం!

  • ఎస్సై అయితే రూ.2 లక్షలు, కానిస్టేబుల్‌కు రూ.లక్ష జరిమానా
  • కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
  • పోలీసుల పోస్టుల్లో ఖాళీలను నివారించేందుకే

పోలీసు శిక్షణ కోసం వెచ్చిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ట్రైనింగ్ పూర్తయ్యాక, ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే వదిలేసి వెళ్లిపోయే వారికి భారీ జరిమానా విధించాలని యోచిస్తోంది.

ప్రభుత్వం ఒక్కో పోలీసు శిక్షణ కోసం రూ.2-3 లక్షలు ఖర్చు చేస్తోంది. గత కొన్ని నెలల్లో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు దాదాపు 300 మంది ఉద్యోగాలను వదిలేశారు. పనిలో వేధింపులు, మరో మంచి ఉద్యోగం, కుటుంబ సమస్యలు తదితర కారణాలతో వీరంతా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎస్సై స్థాయి ఉద్యోగి ఐదేళ్లకు ముందే ఉద్యోగాన్ని వీడితే రూ.2 లక్షలు, ఎస్సై గ్రేడ్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగులు లక్ష రూపాయలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవుతున్న వారు తర్వాత కూడా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. దీంతో పోలీసు ఉద్యోగాల్లో ఖాళీలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలో 36 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News