south Korea: అమెరికాను భూమి మీద లేకుండా చేస్తా: కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞ

  • అమెరికాను బూడిద చేసేస్తా 
  • రెండు లక్షల మంది సైన్యం లక్ష్యం ఒకటే 
  • సైన్యంలో చేరేందుకు 47 వేల మంది విద్యార్థులు సిద్ధం

అమెరికాను భూమి మీద లేకుండా చేస్తానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియాలో రెండు లక్షల మంది వాలంటీర్లు కొత్తగా సైన్యంలో చేరారు. ఈ నేపథ్యంలో 'యాంటీ అమెరికా వార్' పేరిట ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, అమెరికాను భస్మీపటలం చేస్తానని అన్నారు. అమెరికాను అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తానని, బూడిద చేసేస్తానని ఆయన హెచ్చరించారు.

ఈ మేరకు 2 లక్షల 16 వేల మంది సైనికులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ రెండు లక్షల సైన్యం లక్ష్యం ఒక్కటే... అమెరికా ప్రధాన నగరాలపై దాడి చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సైన్యంతో పాటు కలిసి పని చేసేందుకు మరో 47 వేల మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఉత్తరకొరియా మీడియా చెబుతోంది.

అమెరికాపై అంతిమపోరులో గెలవాలంటే ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిదని కిమ్ భావిస్తున్నారని ఉత్తరకొరియా మీడియా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సైన్యంలో చేరేందుకు ఉత్తరకొరియా వాసులు ఉత్సాహం చూపిస్తున్నారని ఆ దేశ మీడియా పేర్కొంది. 

More Telugu News