sachin: 'ఇంత స్వార్థమా?' అని సచిన్ తిట్టాడు... వెంటనే ఔట్ అయిపోయా: సెహ్వాగ్

  • 2011 దక్షిణాఫ్రికా పర్యటనలో ఘటన
  • పాటలు పాడుతూ కాలం గడిపిన సెహ్వాగ్
  • తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సచిన్

డ్యాషింగ్ ఓపెనింగ్ జోడీగా వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ల జోడీ మెరుపులు మెరిపించిన సమయంలో జరిగిన ఓ సంఘటనను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు. 2011లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా, సచిన్ తనను తిట్టాడని, తాను ఆ వెంటనే ఔట్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

ఓ మ్యాచ్ లో తామిద్దరమూ ఓపెనింగ్ బ్యాటింగ్ కు వచ్చామని, తొలి ఓవర్ సజావుగా సాగినా, మ్యాచ్ పై శ్రద్ధ పెట్టడంలో విఫలమై జిడ్డు ఆడుతూ ముందుకు సాగామని అన్నాడు. తాను ఆట మధ్యలో తనకు అలవాటైన ఓ పాటను పాడుతూ బ్యాటింగ్ చేస్తుండగా, తనతో మాట్లాడాలని సైగ చేస్తూ, దగ్గరకు రమ్మని సచిన్ పిలిచాడని, తాను పాట పాడుతూనే వెళ్లగా, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సచిన్, స్వార్థంతో మ్యాచ్ ఆడవద్దని గట్టిగా చెప్పాడని అన్నాడు. దాదాపు 5 ఓవర్లు పరుగులు లేకుండా ముగియడంతోనే సచిన్ కు కోపం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. ఆ ఘటనతో తనకు ఏకాగ్రత చెదిరి, తరువాతి ఓవర్ లోనే ఔట్ అయ్యానని అన్నాడు.

More Telugu News