arasavalli: స్వామిని తాకని సూర్య కిరణాలు... అరసవల్లిలో భక్తులకు తీవ్ర నిరాశ!

  • మబ్బులు పట్టడంతో బయటకు రాని సూర్యుడు
  • నిరాశతో వెనుదిరిగిన భక్తకోటి
  • రేపు కూడా సుందర దృశ్యానికి అవకాశం

ఈ ఉదయం అరసవల్లిలో శ్రీ సూర్య నారాయణ స్వామివారిని భానుని కిరణాలు తాకుతాయని ఆశించి వచ్చిన భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్వామిని సూర్య కిరణాలు తాకలేదు. మబ్బులు పట్టి ఉండటం, మరోవైపు చిరుజల్లులు కురుస్తున్న కారణంగా, సూర్యోదయం వేళ, భానుని దర్శనం జరగలేదు. అప్పటికే కనులకు విందైన దృశ్యాన్ని మనసారా తిలకించాలని వచ్చి బారులుదీరిన భక్తులు, నిరాశతో వెనుదిరిగారు. ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ మాసాల్లో స్వామివారి ఆపాద మస్తకాన్ని సూర్య కిరణాలు తాకుతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. కాగా, రేపు వాతావరణం అనుకూలిస్తే, ఈ సుందర దృశ్యం సాక్షాత్కరిస్తుందని ఆలయ పూజారులు వెల్లడించారు.

More Telugu News