us travel ban: పాకిస్థాన్ ను భారీగా దెబ్బతీసిన ట్రంప్ ట్రావెల్ బ్యాన్!

  • పాకిస్థాన్ కు వీసాలను తగ్గించిన అమెరికా
  • 26 శాతం తగ్గిన నాన్ ఇమిగ్రెంట్ వీసాలు
  • అరబ్ దేశాలపై భారీ ప్రభావం

పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పాకిస్థాన్ పై భారీ ప్రభావం చూపింది. అమెరికా వీసాను ఆశిస్తున్న పాకిస్థానీలు ట్రంప్ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 'పొలిటికో' సంస్థ అధ్యయనం ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నాన్ ఇమిగ్రెంట్ వీసాలు దాదాపు 26 శాతం తక్కువగా మంజూరయ్యాయని తేలింది.

తొలుత ఇరాక్, ఇరాన్, సొమాలియా, లిబియా, సిరియా, యెమెన్, సూడాన్ దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఇరాక్, సూడాన్ లను ఈ జాబితా నుంచి తొలగించారు. ఏదేమైనప్పటికీ ముస్లిం మెజార్టీ దేశాలకు అమెరికా వీసాలు మంజూరు చేయడం తగ్గిపోయిందని పొలిటికో తెలిపింది. అరబ్ దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందట. ట్రావెల్ బ్యాన్ జాబితాలో పాకిస్థాన్ లేనప్పటికీ... ఆ దేశానికి ఇస్తున్న వీసాల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోయింది. 

More Telugu News