ramdev baba: 2020 నాటికి ప్రపంచంలోనే పెద్ద సంస్థగా పతంజలి: రాందేవ్ బాబా

  • 2018 నాటికి యూనీలీవర్ ను అధిగమిస్తాం
  • 2020 నాటికి ప్రపంచంలోనే పెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థగా అవతరిస్తాం
  • త్వరలోనే పతంజలి దుస్తులు
  • ఏపీలో ఉత్పత్తి కేంద్రం

దేశీయ కన్జ్యూమర్ ఉత్పత్తుల అమ్మకాలలో పతంజలి సంస్థ దూసుకుపోతోందని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. 2018-19 నాటికి యూనీలీవర్ లాంటి సంస్థలను పతంజలి అధిగమిస్తుందని తెలిపారు. 2020-21 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి అవతరిస్తుందని చెప్పారు. ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

 ప్రస్తుతం హరిద్వార్ లో రూ. 15 వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యం, తేజ్ పూర్ లో రూ. 25 వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యం పతంజలికి ఉందని... కొత్తగా ఆంధ్రప్రదేశ్, నోయిడా, నాగ్ పూర్, ఇండోర్ లలో ఉత్పత్తి కేంద్రాలు రాబోతున్నాయని చెప్పారు. ఆయిల్, ఉప్పులాంటి ఉత్పత్తులకు 50 చిన్న యూనిట్లు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే జీన్స్ , కుర్తాలు, షర్ట్ లు, ట్రౌజర్లు, యోగా వేర్, స్పోర్ట్ వేర్ లను కూడా విక్రయించబోతున్నామని తెలిపారు.

More Telugu News