hardik pandya: హార్దిక్ పాండ్య బాదిన భారీ సిక్సర్ కు గాయపడ్డ ప్రేక్షకుడు!

  • భారీ సిక్సర్ బాదిన హార్డిక్ పాండ్య
  • అది తగిలి అభిమానికి చిట్లిన పెదవి, నాలుక

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య బాదిన బాదుడికి ఒక అభిమాని గాయపడ్డాడు. తాజాగా టీమిండియా‌-ఆసీస్‌ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన వన్డేలో హార్దిక్ పాండ్య భారీ సిక్సర్ ను బాదాడు. అయితే, ఆ బంతి నేరుగా వెళ్లి గ్యాలరీలో మ్యాచ్‌ వీక్షిస్తున్న తొషిక్ అగర్వాల్ అనే అభిమాని ముఖాన్ని ముద్దాడింది. దీంతో ఆ అభిమాని గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన మైదాన సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు. అతనికి పెదవి, నాలుక గాయమైందని వైద్యులు తెలిపారు. గాయం స్వల్పమైందని అన్నారు. 

More Telugu News