governars: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. విద్యాసాగరరావు ఇక మహారాష్ట్రకే పరిమితం!

  • ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి గవర్నర్లు
  • రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ 
  • తమిళనాడు గవర్నర్ గా భన్వరిలాల్ పురోహిత్

దసరా పండుగ వేళ ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును మహారాష్ట్రకు పరిమితం చేస్తూ, తమిళనాడు గవర్నర్ గా భన్వరిలాల్‌ పురోహిత్‌ ను నియమించారు.

మేఘాలయ గవర్నర్ గా గంగాప్రసాద్‌ ను నియమించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ గా బీడీ మిశ్రా నియమితులయ్యారు. బిహార్‌ గవర్నర్ గా సత్యపాల్‌ మాలిక్‌ ను నియమించారు. అసోం గవర్నర్ గా జగదీష్‌ ముఖీని నియమించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవులకు మాజీ అడ్మిరల్‌ దేవేంద్ర కుమార్‌ జోషిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా నియమిస్తూ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. 

More Telugu News