Germany: వేగంతో దూసుకుపోతున్న రైలును పట్టుకుని.. 25 కిలోమీటర్లు ప్రయాణించిన 59 ఏళ్ల వ్యక్తి!

  • లగేజీ మర్చిపోయి కిందికి దిగిన రొమేనియన్
  • లగేజీ తెచ్చుకునేందుకు సాహసం
  • హైస్పీడ్ రైలు బోగీల మధ్య 25 కిలోమీటర్ల ప్రయాణం
  • సిబ్బంది సూచనతో స్టాప్ లేకున్నా రైలును ఆపిన డ్రైవర్

సాధారణంగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బైక్ పై వెళ్తుంటేనే ఎదురుగా వీచే గాలి వేగానికి బ్యాలెన్స్ తప్పుతుంటుంది. ఇక వంద కిలో మీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ జర్మనీలో 59 ఏళ్ల ఓ వ్యక్తి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న హై స్పీడ్ ట్రైన్‌ ను పట్టుకొని వేలాడుతూ ఇంచుమించు 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించి కలకలం రేపాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... రొమేనియా దేశానికి చెందిన ఒక వ్యక్తి (59) జర్మనీ పర్యటనకు వచ్చాడు. పర్యటనలో భాగంగా బిలేఫీల్డ్ స్టేషన్ లో దిగాడు. అయితే ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా దిగిన ఆ రొమానియన్‌ తన లగేజీని ట్రైన్‌ లోనే మరిచిపోయిన విషయాన్ని గుర్తించాడు. దీంతో తన లగేజీ తీసుకోవాలని వేగంగా కదిలాడు. ఇంతలో ట్రైన్ డోర్లు మూసుకుపోవడంతో...ఎలాగైనా లగేజ్ తీసుకోవాలని భావించి, ఆ ట్రైన్ లో రెండు బోగీలు కలిపే ప్రాంతంలో ట్రైన్ ను పట్టుకుని అలాగే నిలబడిపోయాడు.

దీంతో స్టేషన్ స్టాఫ్ ఆయనను చూసి రైలు డ్రైవర్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన స్టేషన్ లేకున్నా ట్రైన్ ను ఆపాడు. అప్పటికే ఈ హై స్పీడ్ ట్రైన్ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీంతో ఆయన తన లగేజీ తీసుకుని హనోవర్ వరకు వెళ్లాడు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమమేనని జర్మనీ రైల్వే అధికారులు వెల్లడించారు. 

More Telugu News