video viral: కాఫీ షాపులో యువకుడిని చితక్కొట్టిన బంజారాహిల్స్‌ పీఎస్ కానిస్టేబుల్ రమేష్... వీడియో ఇదిగో!

  • అకారణంగా త‌న్నులు తిన్న యువ‌కుడు
  • దారుణంగా ప్ర‌వ‌ర్తించిన కానిస్టేబుల్
  • కాఫీ షాపులోని సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కానిస్టేబుల్ దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో అబ్దుల్‌ గఫార్ అనే ఉద్యోగిని కొడుతూ వీరంగం సృష్టించాడు. కారణం ఏమీ లేకుండానే అత‌డిపై పిడిగుద్దులు కురిపించాడు. రౌడీలా ఆ కానిస్టేబుల్ ప్ర‌వ‌ర్తించిన తీరుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వచ్చింది.  

కాఫీ షాపులోని సీసీ టీవీ కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నిక్షిప్త‌మ‌య్యాయి. ఆ కానిస్టేబుల్ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రమేశ్ అని తెలిసింది.  ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, కానిస్టేబుల్ రమేశ్ ని డీసీపీ ఆఫీసుకి ఎటాచ్ చేశారు.   

More Telugu News