yashwant sinha: 80 ఏళ్ల వయసులో పని వెతుక్కుంటున్న యశ్వంత్ సిన్హా: అరుణ్ జైట్లీ

  • యశ్వంత్ కు పని లేకుండా పోయింది
  • అప్పటి ఎన్పీఏ సంగతేంటి?
  • వృద్ధి తగ్గుదల తాత్కాలికమే
  • కీలక వ్యాఖ్యలు చేసిన అరుణ్ జైట్లీ

భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని ఆరోపిస్తూ, మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కీలక విమర్శలు చేసిన వేళ, అరుణ్ జైట్లీ స్పందించారు. 80 సంవత్సరాల వయసులో పనిలేకుండా ఉన్న ఆయన, ఇప్పుడు ఏదైనా ఓ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నట్టుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి అన్న హోదాను అనుభవించడం లేదని, ఇదే సమయంలో వ్యాసకర్తగా మారిపోయిన మాజీ ఆర్థిక మంత్రి అన్న హోదానూ పొందలేకపోయారని అన్నారు.

 "ఇండియా ఎట్ 70, మోదీ ఎట్ 3.5: కాప్చరింగ్ ఇండియాస్ ట్రాన్స్ ఫార్మేషన్ అండర్ నరేంద్ర మోదీ" పుస్తకాన్ని వివేక్ దేబ్రాయ్, అశోక్ మాలిక్ లు రాయగా, దాన్ని జైట్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దు సహా పలు కీలక ఆర్థిక అంశాలపై యశ్వంత్ చేసిన విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 "ఇండియా ఎట్ 70, మోదీ ఎట్ 3.5 మరియు ఓ ఉద్యోగార్థి ఎట్ 80" అని ఓ పుస్తకం రాయాలని సూచించారు. తానింకా మాజీ ఆర్థిక మంత్రిని కాలేదని, కాలమిస్టును కూడా కాలేదని అందువల్ల సులువుగానే ఈ తరహా మాటలు మరచిపోతానని అన్నారు. 1998 నుంచి 2002 మధ్యకాలంలో యశ్వంత్ ఆర్థిక మంత్రిగా సేవలందించిన వేళ, బ్యాంకుల్లో నమోదైన 15 శాతం నిరర్థక ఆస్తులను తాను మరచిపోతానని అన్నారు. గడచిన త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గడానికి కారణాలు ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఇది కేవలం తాత్కాలికమేనని అన్నారు. దీనిపై ఎవరో చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

More Telugu News