UNO: మా దేశంలోని కంపెనీలను మూసేయండి.. ఉత్తరకొరియాకు చైనా ఆదేశం!

  • తమ దేశంలోని వ్యాపారాలు మూసేయాలని చైనా ఆదేశాలు 
  • 120 రోజుల గడువు పెట్టిన చైనా
  • ఇప్పటికే చమురు ఎగుమతులపై కోత విధించిన చైనా

ఉత్తరకొరియాకు చైనా మరోసారి షాకిచ్చింది. తాము ఎగుమతి చేసే శుద్ధి చేసిన చమురును 2 మిలియన్ బ్యారెల్స్ కు పరిమితం చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన చైనా, తమ దేశంలో ఉన్న ఉత్తరకొరియా కంపెనీలను మూసేయాలని తాజాగా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా తీర్మానంలో భాగంగా... ఆ దేశ కంపెనీలు, చైనా సంస్థలతో జాయింట్‌ వెంచర్‌ చేస్తున్న కంపెనీలను మూసివేసేందుకు 120 రోజుల గడువు ఇస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది.

 ఈ మేరకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ విషయం స్పష్టం చేసింది. తాజా ఆంక్షలతో ఉత్తరకొరియా ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. 

More Telugu News