క్రికెట్: ట‌పాట‌పా రాలిపోయిన‌ టీమిండియా టాప్ ఆర్డ‌ర్‌.. క్రీజులో కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా

  • వెంట వెంటనే ఔటయిన రహానే, రోహిత్ శర్మ, కోహ్లీ 
  • టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 25 ఓవ‌ర్ల‌కి 149

బెంగళూరు వ‌న్డేలో ఆస్ట్రేలియా ఇచ్చిన 335 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ్యాటింగ్ ప్రారంభించిన‌ టీమిండియా ఓపెన‌ర్లు అజింక్యా రహానే, రోహిత్ శర్మ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే ఔట‌య్యారు. 66 బంతులు ఆడిన ర‌హానే 53 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కానె రిచ‌ర్డ్ స‌న్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి విరాట్ కోహ్లీ వ‌చ్చాడు.

ర‌హానే ఔట్ అయిన‌ కొద్ది సేప‌టికే 65 (55 బంతుల్లో) ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద హ్యాండ్స్‌కాంబ్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ అయ్యాడు. రోహిత్ శ‌ర్మ ఔట‌యిన కాసేప‌టికి విరాట్ కోహ్లీ 21 (21బంతుల్లో) ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కౌల్ట‌ర్ నైల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో హార్థిక్ పాండ్యా, కేదార్ జాద‌వ్ ఉన్నారు. టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 25 ఓవ‌ర్ల‌కి 149గా ఉంది.

More Telugu News