కోస్తా జిల్లాలపై పంజా విసరనున్న మూడు భారీ తుపాన్లు

28-09-2017 Thu 16:49
  • గోదావరి జిల్లాల సముద్ర ప్రాంతంలో ఏర్పడే అవకాశం
  • సునామీలు కూడా వచ్చే ప్రమాదం
  • అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం
ఏపీలోని కోస్తా జిల్లాలపై మూడు తీవ్ర స్థాయి తుపానులు పంజా విసరబోతున్నాయి. అక్టోబర్ ప్రారంభం నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా ఈ తుపాన్లు సంభవిస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి జిల్లాలను ఆనుకుని బంగాళాఖాతం సముద్రతీరంలో ఈ తుపాన్లు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే ఇస్రో నిపుణుల బృందం కూడా ఇవే హెచ్చరికలను జారీ చేసింది. సునామీలు కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. నవంబర్ నెలలో గతంలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో, అధికార యంత్రాంగం అలర్ట్ అవుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.