spider: ‘స్పైడర్’ లో మహేశ్ బాబు నటన అద్భుతం: రజనీ కాంత్

  • స్పైడర్ సినిమా చూసిన రజనీ కాంత్
  • మురుగదాస్ ఈ స‌బ్జెక్ట్‌ను అద్భుతంగా హ్యాండిల్‌ చేశారు
  • సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంది
  • సినిమా యూనిట్‌ కి అభినందనలు

మహేశ్ బాబు కొత్త సినిమా ‘స్పైడ‌ర్‌’కి సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. విభిన్న క‌థ‌తో త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెరకెక్కించిన ఈ సినిమాను రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. అనంత‌రం ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా బాగుందని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంద‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు మురుగదాస్ ఈ స‌బ్జెక్ట్‌ను అద్భుతంగా హ్యాండిల్‌ చేశారని, మహేశ్ బాబు న‌ట‌న‌ అద్భుతమ‌ని రజనీ కాంత్ చెప్పారు. ఇటువంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన ఆ సినిమా యూనిట్‌ కి త‌న‌ అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. నిన్న విడుద‌లైన ఈ సినిమాలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. మురుగ‌దాస్ త‌నదైన శైలిలో ఓ మంచి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించారు.  

More Telugu News