spyder: 'స్పైడర్' సినిమాపై మహేష్ బాబు సోదరి మంజుల స్పందన

  • మహేష్ నటన అద్భుతం
  • సాంగ్స్ స్టైలిష్ గా ఉన్నాయి
  • అంతర్జాతీయ స్థాయి చిత్రం

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఈ మూవీ భారీ ఎత్తున విడుదలైంది. ఓవర్సీస్, తమిళనాడులో మంచి టాక్ ను సంపాదించుకుంది. తెలుగునాట మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ... క్లాస్ ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు మహేష్ బాబు సోదరి మంజుల ఈ సినిమాను తొలిరోజే చూశారు. అనంతరం ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మేకింగ్ చాలా బాగుందని చెప్పిన మంజుల... మహేష్ నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. సాంగ్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉందని అన్నారు.

More Telugu News