flight delay: వెయిటింగ్ టైమ్‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ టైమ్‌గా మార్చిన యువ‌తి... వీడియో చూడండి!

  • విమానాశ్ర‌యంలో డ్యాన్సులు
  • విమానం మిస్స‌యినా వినోదాన్ని పంచిన అమెరిక‌న్‌
  • వైర‌ల్ అవుతున్న వీడియో

సాధార‌ణంగా తాము ఎక్కాల్సిన‌ క‌నెక్టింగ్ ఫ్లైట్ మిస్స‌యితే ప్ర‌యాణికులు చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. విమానాశ్ర‌యంలో ఎలా గ‌డ‌పాలో అర్థంకాక ఆందోళ‌న చెందుతుంటారు. కానీ ఈ అమెరికా యువ‌తి మాత్రం అందుకు భిన్నంగా డ్యాన్సులు చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తాను ఎక్కాల్సిన క‌నెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవ‌డంతో మ‌హ్షీద్ మ‌జూజీ అనే యువ‌తి నార్త్ క‌రోలినాలోని చార్లెట్ డ‌గ్ల‌స్ విమానాశ్రయంలో ఒక రాత్రంతా గ‌డ‌పాల్సి వ‌చ్చింది.

దీంతో ఆమె ఫ్లైట్ గురించి దిగులు చెంద‌కుండా, విమానాశ్ర‌యమంతా క‌లియ‌దిరుగుతూ అక్క‌డి సిబ్బందితో క‌లిసి డ్యాన్సులు వేసింది. అక్క‌డి దుకాణాల్లో ప‌నిచేసే వారితో, విమానాల కోసం ఎదురుచూస్తున్న ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి మ‌హ్షీద్ స్టెప్పులు వేసింది.

ఈ వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్దిసేప‌టికే 10 ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా చార్లెట్ డగ్ల‌స్ విమానాశ్ర‌యం కూడా ఈ వీడియోను షేర్ చేయ‌డంతో ఇది ఇంకా వైర‌ల్‌గా మారింది.

More Telugu News