north korea: మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్న కిమ్ జాంగ్.. యుద్ధం తప్పదన్న దక్షిణ కొరియా

  • ప్రపంచ దేశాల సూచనలు బేఖాతరు
  • మొండిగా ముందుకెళుతున్న ఉత్తర కొరియా
  • దేశ వార్షికోత్సవం సందర్భంగా మరో క్షిపణి పరీక్ష
  • యుద్ధానికి దారి తీస్తుందన్న దక్షిణ కొరియా

ఉత్తర కొరియా నిర్వహిస్తున్న వరుస అణుప్రయోగాలు, క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో... ఇప్పటికే ఆ దేశానికి, అమెరికాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు దేశాలు ఇంతవరకు యుద్ధ ప్రకటన చేయనప్పటికీ... ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దూకుడు తప్పించుకోవాలంటూ ఉత్తర కొరియాకు పలు దేశాలు సూచిస్తున్నప్పటికీ... ఆ దేశం బేఖాతరు చేస్తోంది.

ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నారనే వార్త ఆందోళనలను మరింత పెంచుతోంది. డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వార్షికోత్సవం సందర్భంగా... అక్టోబర్ 10వ తేదీ లేదా 18న ఈ క్షిపణి పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంక్ ఇయెంగ్ వెల్లడించారు. ఒకవేళ ఇదే జరిగితే... పరిస్థితి యుద్ధానికి దారి తీయవచ్చని ఆయన అన్నారు.  

More Telugu News