sbi big mistake: అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించిన ఎస్‌బీఐ... రూ. 100 కోట్ల‌ను త‌ప్పుడు అకౌంట్‌కు బ‌దిలీ చేసిన బ్యాంకు

  • నెల‌న్న‌ర త‌ర్వాత త‌ప్పును గుర్తించిన అధికారులు
  • రూ. 30 కోట్లు న‌ష్టం
  • రాంచీ జోన్‌లోని ఓ ఎస్‌బీఐ బ్రాంచి త‌ప్పిదం

దేశంలో బ్యాంకింగ్ సేవ‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌న అజాగ్ర‌త్త‌ కార‌ణంగా ఓ పెద్ద త‌ప్పిదం చేసింది. రూ. 100 కోట్ల‌ను త‌ప్పుడు అకౌంట్‌కు బ‌దిలీ చేసి రూ. 30 కోట్లు న‌ష్టం తెచ్చింది. జార్ఖండ్‌లో రాంచీ జోన్ ప‌రిధిలోని ఓ ఎస్‌బీఐ బ్రాంచి ఈ పొర‌పాటు చేసింది. ఆ రాష్ట్ర మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థకం కోసం కేటాయించిన రూ. 100 కోట్ల నిధుల‌ను ఓ నిర్మాణ రంగ సంస్థ ఖాతాలో పొరపాటుగా జ‌మ చేసింది.

 ఈ త‌ప్పిదాన్ని దాదాపు నెల‌న్న‌ర త‌ర్వాత ఎస్‌బీఐ అధికారులు గుర్తించారు. త‌ర్వాత కొంత సొమ్ము వెనక్కి తీసుకున్న‌ప్ప‌టికీ పూర్తి మొత్తాన్ని రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఇంకా రూ. 30 కోట్లు ఆ నిర్మాణ సంస్థ నుంచి తిరిగి తీసుకోవాల్సి ఉంది. ఈ పొర‌పాటుకు సంబంధించి రాంచీ జోన్ ఎస్‌బీఐ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ డీకే పాండా అంత‌ర్గ‌తంగా విచార‌ణ జ‌రిపిస్తున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News