dera baba: డేరా బాబా ఆస్తుల మొత్తం విలువ 1600 కోట్లు!

  • హైకోర్టుకు గుర్మీత్ రాం రహీం ఆస్తుల వివరాలు 
  • సిర్సాలోనే 1453 కోట్ల రూపాయల ఆస్తులు
  • డేరా బాబాకు 504 బ్యాంకు ఖాతాలు
  • బ్యాంకు ఖాతాల్లో వున్న మొత్తం 75 కోట్లు 

అత్యాచారం కేసులో రోహ్ తక్ జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా మాజీ చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ భారీగా ఆస్తులు కూడబెట్టారని హర్యాణా ప్రభుత్వం వెల్లడించింది. గుర్మీత్ అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను హైకోర్టుకు అందజేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే.. డేరా ఆశ్రమ కేంద్రమైన సిర్సాలో 1453 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపింది. అంబాలాలో 32.20 కోట్ల విలువైన ఆస్తులు, ఝాజ్జర్‌ లో 29.11 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు, ఫతేబాద్‌ లో 20.70 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

 అలాగే డేరా బాబాకు 504 బ్యాంకు ఖాతాలున్నాయని వెల్లడించింది. వాటిల్లో సుమారు 75 కోట్ల రూపాయలు ఉన్నాయని న్యాయస్థానానికి చెప్పింది. ఒక్క సిర్సా జిల్లాలోనే 495 బ్యాంకు ఖాతాలు ఉండడం విశేషం. ఈ మొత్తం ఆస్తుల విలువ 1600 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని హర్యాణా ప్రభుత్వం అంచనా వేసింది. 

More Telugu News