raja mouli: అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల‌పై లండన్ లో వర్క్ షాప్.. దానికి రాజమౌళి హాజరవుతారు: మంత్రి నారాయణ

  • 16 ప్యాకేజీలకు ఇప్ప‌టికే టెండ‌ర్లు పిలిచాం
  • ముఖ్య భ‌వ‌నాల‌కు 15 రోజుల్లోపు డిజైన్లు పూర్తి
  • అక్టోబ‌ర్ 11, 12, 13 తేదీల్లో లండ‌న్‌లో డిజైన్ల‌పై వ‌ర్క్‌షాప్
  • అక్టోబ‌ర్ 25న లండ‌న్‌లో డిజైన్లపై చంద్ర‌బాబు తుది నిర్ణ‌యం

అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ ద్వారా 16 ప్యాకేజీలకు ఇప్ప‌టికే టెండ‌ర్లు పిలిచామ‌ని, మ‌రో రెండింటికి పిలవాల్సి ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారాయ‌ణ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... సీఆర్డీఏ ప‌నుల‌కు కూడా టెండ‌ర్లు పిలిచామ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి నివాసం, స‌చివాల‌యం, ఇత‌ర ముఖ్య భ‌వ‌నాల‌కు 15 రోజుల్లోపు డిజైన్లు పూర్తి చేస్తామ‌ని అన్నారు.

అక్టోబ‌ర్ 11, 12, 13 తేదీల్లో లండ‌న్‌లో అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల‌పై వ‌ర్క్‌షాప్ నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనికి సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా హాజ‌ర‌వుతార‌ని నారాయణ అన్నారు. అక్టోబ‌ర్ 25న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లండన్ కు విచ్చేసి, డిజైన్లపై తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు.

More Telugu News