honeybees: తేనెటీగ‌ల కార‌ణంగా 90 నిమిషాలు ఆల‌స్యంగా బ‌య‌ల్దేరిన విమానం

సాధార‌ణంగా వాతావ‌ర‌ణం బాగోలేక‌పోతేనో లేక ఏదైనా సాంకేతిక కార‌ణం వ‌స్తేనో మిన‌హా విమాన ప్ర‌యాణాలు ఆల‌స్యం కావు. కానీ ఇండోనేషియాలోని కౌలానాము అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోని సిటీలింక్ విమానం ఈ రెండు కార‌ణాల వ‌ల్ల కాకుండా మ‌రో ప్ర‌త్యేక కార‌ణం వ‌ల్ల త‌న ప్ర‌యాణాన్ని 90 నిమిషాలు వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ ఆటంకం క‌లగ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?.... తేనెటీగ‌లు. అవును... బ‌య‌ల్దేర‌డానికి సిద్ధంగా ఉన్న విమానం కుడి వైపు రెక్క మీద ఒక్క‌సారిగా వంద‌ల కొద్దీ తేనెటీగ‌లు వ‌చ్చి చేరాయి. దీంతో దాదాపు 90 నిమిషాల పాటు విమాన ప్ర‌యాణాన్ని అధికారులు వాయిదా వేశారు. తేనెటీగ‌లు ఎంత‌కీ వెళ్ల‌క‌పోవ‌డంతో అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చి పైపుల ద్వారా నీళ్లు కుమ్మ‌రించి తేనెటీగ‌ల‌ను చెద‌ర‌గొట్టారు.

More Telugu News