rahul dravid: ఆ మాట వింటే చిరాకు పుడుతుంది... అసలు క్రికెట్ లో అలాంటి శైలే లేదు: రాహుల్ ద్రవిడ్

  • సహజశైలి అన్నదే క్రికెట్ లో లేదు
  • టెస్టుల్లో ఆడినట్టు వన్డేల్లో ఆడకూడదు 
  • క్రికెటర్ జట్టు అవసరాలు, సందర్భానికి తగినట్టు ఆడితేనే ఫలితం
  • హార్దిక్ పాండ్య తనను తాను చక్కగా మలచుకున్నాడు

క్రికెట్ లో సహజశైలిలో ఆడు అన్న మాట వినిపిస్తుంటుందని, అయితే ఈ మాట విని విసుగొస్తుందని టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. విజయవాడలో న్యూజిలాండ్-ఏ జట్టుతో భారత-ఏ జట్టు ఆడనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. అసలు క్రికెట్ లో సహజశైలి అనేదే ఉండదని అన్నాడు. క్రికెటర్ ఎవరైనా సందర్భానికి తగినట్టు ఆడాల్సిన అవసరం ఉంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో వచ్చే ఓపెనర్ నెమ్మదిగా నిలదొక్కుకుంటాడని, అలాగే వన్డేలు, టీ20ల్లో కూడా ఆడుతానంటే కుదరదని చెప్పాడు. అలాగే ఇతర ఫార్మాట్లకు కూడా ఇది వర్తిస్తుందని గుర్తుచేశాడు.

ప్రస్తుతం టీమిండియాలో హార్దిక్ పాండ్య సందర్భానుసారం ఆడుతున్నాడని అన్నాడు. పాండ్య లాంటి ఆటగాళ్లు భారత్-ఏలో చాలామంది ఉన్నారని చెప్పాడు. పాండ్య తనను తాను మలచుకున్నాడని తెలిపాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తే ఆ స్థానానికి అనువుగా బ్యాటింగ్ చేయాల్సి ఉందని చెప్పాడు. దానిని హార్దిక్ పాండ్య చాలా చక్కగా తనకు తగ్గట్టుగా మలచుకున్నాడని తెలిపాడు.

హార్దిక్ జట్టు అవసరానికి తగ్గట్టు, సందర్భానికి తగినట్టు ఆడుతున్నాడని, ఇది టీమిండియాకు లాభం చేకూరుస్తుందని ద్రవిడ్ తెలిపాడు. కాగా, వర్ధమాన క్రికెటర్లను తయారు చేయడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా చీఫ్ కెప్టెన్ గా ఉండమని సహచరులు సూచించినా ద్రవిడ్ అంగీకరించక పోవడం గమనార్హం. 

More Telugu News