geo phone: జియో 4జీ ఫోన్ వినియోగదారులకు.. 'చేదు' నిబంధనలు!

  • కస్టమర్లకు షాక్ ఇచ్చిన జియో
  • మినిమన్ రీచార్జ్ లు చేయించుకోకపోతే డిపాజిట్ రాదు
  • ఫోన్ రిటర్న్ చేస్తే ఫైన్, జీఎస్టీ బాదుడు
  • మండిపడుతున్న వినియోగదారులు

రిలయన్స్ జియో ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎంతగానంటే, డిమాండ్ ను తట్టుకోలేక, బుకింగ్స్ ను కూడా నిలిపివేసేంతగా. ఫోన్ ను బుక్ చేసుకున్నవారంతా, దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, వీరందరికీ సినిమా చూపించబోతోంది జియో. మాండేటరీ రీచార్జ్ ల పేరుతో భారీ బాదుడుకు జియో సిద్ధమైంది. కనీస రీచార్జ్ లు, ఫోన్ రిటర్న్ లకు సంబంధించి పలు నిబంధనలు జియో తన వెబ్ సైట్లో పేర్కొంది.

ఫోన్ కోసం కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 1500 సొమ్మును తిరిగి పొందాలంటే... మూడు ఏళ్లలో కనీసం రూ. 4,500 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం కచ్చితంగా రూ. 1500 రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఏ కారణంగానైనా మూడు నెలల పాటు రీచార్జ్ చేసుకోకపోతే... డిపాజిట్ సొమ్మును జియో తిరిగి చెల్లించదు.

అంతేకాదు, ఒకవేళ మధ్యలోనే ఫోన్ ను వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి 12 నెలల్లోపే ఫోన్ ను రిటర్న్ చేస్తే... రూ. 1500లతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం రిటర్న్ చేస్తే రూ. 1000 ఫైన్ తో పాటు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. మూడవ సంవత్సరంలో రిటర్న్ చేస్తే రూ. 500 ఫైన్ తో పాటు జీఎస్టీ కట్టాలి. జియో విధించిన తాజా నిబంధనలపై కస్టమర్లు మండిపడుతున్నారు. జియో ఫోన్ అసలు స్వరూపం బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News