Pakistan: ప్రజలు ఇబ్బంది పడితే పడనీ... భారత్ టమోటాలు మాత్రం మాకొద్దు!: పాకిస్థాన్

  • నిన్న మొన్నటి వరకు కేజీ టమోటా 100 నుంచి 150
  • భారత్ నుంచి దిగుమతిని ఆపేసిన పాకిస్థాన్
  • ప్రస్తుతం కేజీ టమోటా ధర 300 రూపాయలు
  • టమోటా కొరతతో ప్రజల ఇబ్బందులు 

తమ దేశాన్ని తీవ్ర స్థాయిలో టమోటా కొరత వేధిస్తున్నా.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా భారత్ నుంచి మాత్రం వాటిని దిగుమతి చేసుకోమని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఆహార శాఖ మంత్రి సికిందర్ హయత్ బోసన్ మాట్లాడుతూ, నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్ లో కేజీ టమోటా ధర 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఉందని అన్నారు.

భారత్ నుంచి దిగుమతులను నిలిపేయడంతో కేజీ టమోటా ధర 300 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. దీనిపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ భారత్ నుంచి టమోటాలను మాత్రం దిగుమతి చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, టమోటాల కొరతతో లాహోర్, పంజాబ్ ప్రాంతాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. 

More Telugu News