kcr: సింగరేణి ఎన్నికల్లో కేసీఆర్ కు చుక్కలు చూపించండి: జీవన్ రెడ్డి

  • సింగరేణి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూడా కేసీఆర్ కు లేదు
  • ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
  • కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు

కార్మికుల శ్రమను టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో ఆయనకు చుక్కలు చూపించాలని అన్నారు. 2012లో కేసీఆర్ మాట్లాడుతూ ఓసీపీలతో సింగరేణి బొందలగడ్డగా మారిందంటూ కామెంట్ చేశారని... ఇప్పుడు సొంత పాలనలో కేసీఆర్ 13 ఓసీపీలను ఏర్పాటు చేశారని విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూడా కేసీఆర్ కు లేదని అన్నారు.

గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... దాని సంగతి ఏమైందని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారని... గత మూడేళ్లలో రూ 80 వేల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు.

More Telugu News