osama bin laden: ఒసామా బిన్‌లాడెన్ జీవిత క‌థ‌తో సినిమా... ద‌ర్శ‌కుడు విశాల్ భ‌రద్వాజ్‌!

అమెరికాను గ‌డ‌గ‌డ‌లాడించి, త‌ర్వాత ఆ దేశం చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర‌వాది ఒసామా బిన్‌లాడెన్ జీవితక‌థ ఆధారంగా త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎక్కువ‌గా న‌వ‌లల ఆధారంగా సినిమాలు తెర‌కెక్కించే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విశాల్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్న‌ట్లు స‌మాచారం. పాకిస్థాన్‌లో ఒసామాను మ‌ట్టుబెట్టిన `అబోట్టాబాద్` ప్రాంతం పేరునే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్ట‌నున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల కథనం.

కేథరీన్‌ స్కాట్‌, క్లార్క్‌, ఆడ్రియన్‌ లివై రాసిన ‘ది ఎక్సైల్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత షేక్‌స్పియర్ రాసిన మ్యాక్‌బెత్‌, ఓథెల్లో, హ్యామ్లెట్‌ నవలలను విశాల్ భ‌ర‌ద్వాజ్ మక్బూల్‌, ఓంకారా, హైదర్ సినిమాలుగా తెరకెక్కించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News