Man Arrested : కారులో పోలీసులు.. గమనించక ఆ కారునే చోరీ చేయబోయిన దొంగ!

  • జ‌పాన్‌లోని నుమాజులో కారు చోరీ చేయాలనుకున్న దొంగ
  • ముందూ వెనుకా చూసుకోకుండా రంగంలోకి దిగిన వైనం 
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్న పోలీసులు

దొంగ‌లు తెలివి మీరి ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం గురించి అప్పుడ‌ప్పుడు వింటుంటాం. అలాగే తెలివి త‌క్కువ‌గా ప్ర‌వ‌ర్తించ‌డం గురించి కూడా వింటుంటాం. జ‌పాన్‌లోని నుమాజులో ఈ దొంగకు కొంచం కూడా తెలివి లేదేమో!  కారును చోరీ చేయాల‌నుకుంటే దొంగ‌లు ఎన్నో ప్లాన్లు వేసుకుని వ‌స్తారు. పార్కింగ్ స్థలంలో ఎవ‌ర‌యినా త‌మ‌ని గ‌మ‌నిస్తున్నారా? అన్న అంశాన్ని కూడా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి కార్య‌ రంగంలోకి దిగుతారు.

అయితే, ఉషియో షాటో (23) అనే ఈ దొంగ మాత్రం తాను చోరీ చేయాల‌నుకున్న‌ కారులో ఎవ‌ర‌యినా ఉన్నారా? అన్న విష‌యాన్ని కూడా గ‌మ‌నించ‌లేదు. తాను చోరీ చేయాల‌నుకున్న కారు వద్ద‌కు మెల్లిగా వ‌చ్చిన ఆ దొంగ.. దాన్ని దొంగిలించాల‌ని ప్రయత్నం చేశాడు. అందులో పోలీసులు కూర్చుని ఉన్నార‌ని, అది పోలీసుల కారని ఆ దొంగ‌కి అప్పుడుగానీ తెలియ‌లేదు. వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోవాల‌ని చూశాడు. అయితే, పోలీసులు అత‌డిని ప‌ట్టేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మీడియాకు పూర్తి వివ‌రాలు చెప్ప‌డానికి అక్క‌డి పోలీసులు ఒప్పుకోలేదు.   

More Telugu News