ram gopal reddy: రామ్ గోపాల్ వర్మ కాదు.. రామ్ గోపాల్ రెడ్డి: మార్ఫింగ్ ఫొటోను పోస్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ హీరో

  • ఆర్‌జీఆర్‌ అంటే రామ్ గోపాల్ రెడ్డి
  • ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ ఫొటో
  • వర్మను తీసేసి రెడ్డిగా పెట్టిన విజయ్ దేవరకొండ
  • అలరిస్తోన్న ఫొటో

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తీరు అచ్చం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మలాగే ఉంటోంద‌ని ప్రేక్ష‌కులు అంటోన్న విష‌యం తెలిసిందే. రామ్ గోపాల్ వ‌ర్మలాగే ఈ కుర్ర‌హీరో వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న‌ను వ‌ర్మ-2 గా అభివ‌ర్ణిస్తున్నారు. కొంద‌రు యంగ్ ఆర్జీవీ అంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న ఈ రోజు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశాడు.

అందులో ఆర్‌జీఆర్‌ (రామ్ గోపాల్ రెడ్డి) ను ప‌రిచ‌యం చేస్తున్నానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. ‘రామ్ గోపాల్ రెడ్డికి హాయ్ చెప్పండి’ అంటూ విజ‌య్ దేవ‌రకొండ పేర్కొన్నాడు. దీనిపై 'నీకు మంచి ఫ్రెండ్ దొరికాడు' అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డికి తండ్రి ఆర్‌జీఆర్' అని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఈ ఫొటోను రామ్ గోపాల్ వర్మ కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది. మీరూ చూడండి...

More Telugu News