Colombo: బంగారం స్మగ్లింగ్ చేసేందుకు అతడు ఎంచుకున్న మార్గం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • కొలంబో ఎయిర్ పోర్ట్ లో బంగారం స్మగ్లర్ అరెస్టు
  • కేజీ బంగారం పాలిధీన్ కవర్ లో చుట్టి మలద్వారంలో ఉంచుకున్న స్మగ్లర్
  • కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసి, పట్టుకున్న అధికారులు 

వివిధ దేశాల నుంచి భారత్ కు బంగారం భారీ ఎత్తున అక్రమంగా చేరుతున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో కస్టమ్స్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడుతోంది. ప్రధాన విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతకు తోడు, అనుమానితులపై నిఘా వేయడంతో స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. అయితే స్మగ్లర్లు కూడా ఎప్పటికప్పుడు తమ రూటు మారుస్తూ కస్టమ్స్ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక రాజధాని కొలంబో నుంచి అక్రమ మార్గంలో బంగారం తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడ్ని కొలంబోలో కస్టమ్స్ అధికారులు కస్టడీలోకి తీసుకుని, అతను బంగారం తరలించేందుకు ఎంచుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. సుమారు కేజీ బంగారాన్ని భారత్ కు తరలించాలని భావించిన సదరు స్మగ్లర్... బంగారం పాలిధీన్ కవర్ లో చుట్టి, దానిని మల ద్వారంలో ఉంచుకుని బయల్దేరాడు. అయితే అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అతనిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు అతని పన్నాగాన్ని పట్టేశారు. కాగా, అతను తరలించాలనుకున్న బంగారం విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. 

More Telugu News