adolf hitler: రూ. 3.5 ల‌క్ష‌లు ప‌లికిన అడాల్ఫ్ హిట్ల‌ర్ ధరించిన నిక్క‌రు!

జ‌ర్మ‌న్ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ ఉప‌యోగించిన నిక్క‌రు అమెరికాలో నిర్వ‌హించిన ఓ వేలంలో రూ. 3.5 లక్ష‌లు ప‌లికింది. గోధుమరంగు ప‌లుచ‌ని వ‌స్త్రం మీద తెల్ల‌ని చారలతో ఉన్న ఈ నిక్క‌రు పొడ‌వు 19 అంగుళాలు. దీని న‌డుము సైజు 39 అంగుళాలు. దీని మీద `ఏహెచ్‌` అనే గుర్తు కూడా ఉంది.

1938లో ఆస్ట్రియాలోని పార్క్‌హోట‌ల్ గ్రాజ్ హోట‌ల్‌లో బ‌స చేసిన‌పుడు హిట్ల‌ర్ ఈ నిక్క‌రును అక్క‌డ వ‌దిలేసిన‌ట్లు వేలం నిర్వ‌హించిన సంస్థ తెలిపింది. ఆ హోట‌ల్ య‌జ‌మానుల వంశానికి చెందిన ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర్నుంచి ఈ నిక్క‌రును వేలం నిర్వ‌హ‌ణ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నిక్క‌రుతో పాటు హిట్ల‌ర్ బ‌స చేసిన హోట‌ల్ గ‌దిలో మ‌రికొన్ని చిన్న చిన్న వ‌స్తువుల‌ను కూడా వ‌దిలేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News