germany: జర్మనీ ఎలక్షన్స్... మెర్కెల్ ను మళ్లీ గెలిపించిన ప్రజలు

  • గతంతో పోలిస్తే తగ్గిన ఓట్లు
  • మెర్కెల్ పార్టీకి 33.2 శాతం ఓట్లు
  • మరో చిన్న పార్టీతో కలసి అధికారాన్ని పంచుకోనున్న మెర్కెల్

గతంతో పోలిస్తే ఓట్లు తగ్గినా, తమకు చాన్సలర్ గా ఏంజిలా మెర్కెలే కావాలని జర్మన్లు కోరుకున్నారు. జర్మనీ పార్లమెంట్ దిగువసభ 'బుందేస్టాగ్'కు జరిగిన ఎన్నికల్లో ఆమె 33.2 శాతం ఓట్లు సాధించారు. ఆమె క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ తరపున బరిలోకి దిగగా, ప్రధాన విపక్షమైన సోషల్ డెమోక్రటిక్ కు 20.8 శాతం, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి 13.1 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇమిగ్రేషన్ ను వ్యతిరేకిస్తున్న పార్టీలకు ప్రజల నుంచి తిరస్కరణ ఎదురైంది.

ఇక సాధారణ మెజారిటీ రాకపోవడంతో మరో పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని మెర్కెల్ మరోమారు అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఈ విజయం తరువాత మెర్కెల్ మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కాగా, 1949 తరువాత ఓ పార్టీ ఇంత తక్కువ శాతం ఓట్లతో విజయం సాధించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

More Telugu News