Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • శ్రీను వైట్ల సినిమాలో కాజల్ అగర్వాల్ 
  • స్పైడర్ ప్రీమియర్ షో టికెట్స్ కి ఫుల్ డిమాండ్ 
  • వచ్చే నెలలో 'అమ్మాయిలంతే ..అదోటైపు'
  • విజయదశమికి చరణ్ ఫ్యాన్స్ కి గిఫ్ట్    

*  ఎంతమంది కొత్త హీరోయిన్లు వస్తున్నా తన అవకాశాలు తాను పొందుతున్న అందాలతార కాజల్ అగర్వాల్ తాజాగా తెలుగులో మరో ఛాన్స్ కొట్టింది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నాయికగా ఆమెను ఎంపిక చేశారట.  
*  మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' చిత్రానికి అమెరికాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ప్రీమియర్ షో టికెట్స్ అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్టు వార్తలొస్తున్నాయి.  
*  గోపీవర్మ, మాళవిక మీనన్ జంటగా 'అమ్మాయిలంతే.. అదోటైపు' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. అమ్మాయిలలోని ఎమోషనల్ యాంగిల్ ను ఇందులో ఆవిష్కరించడం జరుగుతుందని చిత్ర దర్శకుడు కృష్ణమ్ తెలిపారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.    
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'రంగస్థలం' చిత్రం ఫస్ట్ లుక్ ను ఈ నెల 30న విజయదశమికి రిలీజ్ చేయనున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది.  

More Telugu News