tirumala: తిరుమల గురించి ఆసక్తికర విశేషాలు!

  • అత్యంత వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
  • దేవదేవుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం తిరుమల
  • అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయం ఇదొక్కటే
  • ఒక రోజు రికార్డు కలెక్షన్ రూ. 5.73 కోట్లు

ఏడుకొండలపైన స్వయంభువుగా  వెలసిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల గురించిన ఆసక్తికర విశేషాలివి.
* ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయం తిరుమల శ్రీవెంకటేశ్వరాలయం.
* వెంకన్న పేరిట తక్కువలో తక్కువగా 4,500కు పైగా ఎకరాల భూమి రిజిస్టరై ఉంది.
* వివిధ బ్యాంకుల్లో రూ. 9,500 కోట్ల డిపాజిట్లు ఉండగా, ఏటా రూ. 800 కోట్ల వడ్డీ వస్తోంది.
* హుండీ నుంచి రోజుకు సుమారు రూ. 3 కోట్లు వస్తుంది.
* ఒక రోజు రికార్డు కలెక్షన్ రూ. 5.73 కోట్లు.
* నిత్యమూ తిరుమలలో జరిగే వ్యాపారం విలువ రూ. 2 కోట్లు. టోపీలు, ఫోటోల వ్యాపారమే రూ. 70 లక్షల వరకూ ఉంటుందని అంచనా.
* స్వామివారికి రోజూ 120 రకాల ఆభరణాలతో అలంకారం.
* స్వామికి అలంకరించే బంగారు పీతాంబరం బరువు 40 కిలోలు.
* స్వామి వద్ద అత్యంత అరుదైన గరుడమేరు పచ్చ ఉంది. ఉత్సవాల్లో మాత్రమే దీనిని అలంకరిస్తారు.
* స్వర్ణ రథం తయారీకి 74 కిలోల బంగారాన్ని వాడారు.
* నిత్యమూ 7 కిలోల వరకూ బంగారం, వెండి కానుకలు స్వామి హుండీలో చేరుతాయి.
* ఆసియాలో అతిపెద్ద వంటశాల తిరుమలలో ఉంది.
* రోజుకు లక్ష మంది ఇక్కడ అన్న ప్రసాదాన్ని తీసుకుంటారు.
* స్వామి అలంకరణ కోసం రోజూ 15 వేల కిలోల పూలు దేశ విదేశాల నుంచి వస్తాయి.
* 200 మంది ఈ పూలను కట్టి స్వామి వారికి సహా, పలు వసతి భవనాలు, కాటేజీల్లో అలంకరణకు వాడుతారు.
* నిత్యమూ నాలుగు లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తుంటారు.
* 24 గంటలూ తెరచివుండే కల్యాణ కట్టలో 700 మంది క్షురకులకు విధులు.
* గత సంవత్సరం తలనీలాల ఆదాయం రూ. 150 కోట్లు.
* స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు రోజుకు 90 మందికి విధులు.
* స్వామివారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల బరువు 13 వేల కిలోలకు పైగానే.

More Telugu News